: పీవీ సింధుకు 'ఖేల్ రత్న' అవార్డు... 29న ప్రదానం
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతక విజేత పూసర్ల వెంకట సింధుకు ప్రతిష్ఠాత్మక 'ఖేల్ రత్న' అవార్డు దక్కింది. ఈ నెల 29న ఢిల్లీలో ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్టు కేంద్రం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. కాగా, రెజ్లింగ్ లో వినీత్ ఫోగత్ కాంస్యం గెలుచుకోగానే, ఆమెకు ఖేల్ రత్న ఇవ్వాలని క్రీడాశాఖ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే గంటలు తిరక్కుండానే సింధు పతకాన్ని ఖాయం చేసుకోవడం, రెండు రోజుల కిందటి మ్యాచ్ లో రజత పతకాన్ని గెలవడంతో, ఖేల్ రత్న ఆమె వశమైంది. కాగా, 28న సింధుకు ఓ కారును బహుమతిగా ఇవ్వనున్నట్టు లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించారు.