: పోలీసులకు 'రెడ్ క్వీన్' సంగీతా చటర్జీ ఆరో'సారీ'!


చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుని పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్న 'రెడ్ క్వీన్' సంగీతా చటర్జీని అరెస్ట్ చేసేందుకు కోల్ కతా వెళ్లిన పోలీసులకు మరోమారు చుక్కెదురైంది. ఆమె బెయిల్ ను పొడిగిస్తూ ఆరోసారి ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు నెలల క్రితమే ఆమెను అరెస్ట్ చేసేందుకు చిత్తూరు కోర్టు నుంచి వారెంట్ పొందిన పోలీసులు పలు మార్లు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో తనకున్న పరపతితో, అరెస్టయిన గంటల వ్యవధిలోనే బెయిల్ తెచ్చుకుని, ఆపై దాన్ని పొడిగించుకుంటూ సంగీత కాలం గడుపుతోంది. ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తేనే, ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని, దీని వెనకున్న పెద్ద తలకాయలను పట్టుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News