: కొండ దిగి రెండు కిలోమీటర్లు సాగిన దుర్గమ్మ భక్తుల క్యూ... కుమ్మరిపాలెం జంక్షన్ దాకా!


కృష్ణా పుష్కరాల పదవ రోజున ఎన్నడూ లేనంతమంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి పోటెత్తారు. కొండపై ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ నిండిపోయి, భక్తుల వరుస కొండ దిగి, విజయవాడ హైవేలోని కుమ్మరిపాలెం జంక్షన్ వరకూ సాగింది. కొండ దిగువన ఉన్న దుర్ఘా ఘాట్ లో స్నానం చేసిన భక్తులను మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. వీరంతా కూడా దాదాపు కిలోమీటర్ దూరం నడిచి కుమ్మరిపాలెం కూడలి వద్ద క్యూ లైన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో యాత్రికులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మరోవైపు విజయవాడలోని ఘాట్లన్నీ నిండిపోవడంతో, వస్తున్న రైళ్లను నగరం బయట ఏర్పాటు చేసిన శాటిలైట్ స్టేషన్లలోనే నిలుపుతూ, పుష్కర భక్తులను దింపుతున్నారు. బస్సులను సైతం నగరంలోకి రానీయకుండా శివార్లలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్ లకే పరిమితం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News