: నేడు అందరి కళ్లూ యోగేశ్వర్ దత్ పైనే... 'లండన్' రిపీటైతే మూడో పతకం!


యోగేశ్వర్ దత్... నాలుగేళ్ల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా లండన్ లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు. ఇప్పుడు రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో 65 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగనుండటంతో, సగటు క్రీడాభిమాని, యోగేశ్వర్ దత్ రాణించి, భారత్ కు మరో పతకాన్ని జోడిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు రెజ్లింగ్ 65 కిలోల విభాగం పోటీలు ప్రారంభం కానున్నాయి. 34 సంవత్సరాల వయసులో తన తుది ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటున్న యోగేశ్వర్, భారత పతక పట్టికను ముందుకు నడిపిస్తాడని ఆశిద్దాం. మూడు మ్యాచ్ లలో యోగేశ్వర్ గెలిస్తే, ఇండియాకు మూడో పతకం ఖాయమవుతుంది.

  • Loading...

More Telugu News