: పాకిస్థాన్ ను పొగడుతూ మాజీ ఎంపీ, నటి రమ్య వ్యాఖ్యలు... తీవ్ర విమర్శలు


పాకిస్థాన్ లో పరిస్థితులు బాగున్నాయని, అది చాలా మంచి దేశమని మెచ్చుకుంటూ, మాజీ ఎంపీ, కన్నడ నటి రమ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను తీవ్ర విమర్శలకు గురి చేస్తున్నాయి. ఇటీవల పాక్ కు వెళ్లి, అక్కడో కార్యక్రమంలో పాల్గొని ఇండియాకు వచ్చిన ఆమె, మాండ్యలో మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ కు వెళితే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయనలా పేర్కొనడం సరికాదని, ఇండియాలో ప్రజలు ఎలా నివసిస్తున్నారో, పాక్ లో కూడా అలాగే ప్రజలు ఉన్నారని, అది చాలా మంచి దేశమని అన్నారు. పాక్ వెళ్లిన వారిని బాగా చూసుకుంటారని కూడా వ్యాఖ్యానించారు. రమ్య వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరససలు తెలిపాయి. ఆమె వ్యాఖ్యలు సరికాదంటూ విమర్శలు పెరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News