: కర్ణాటక మంత్రి ఇంట్లోకి చొరబడి.. సీఎం ఫోటోను చెప్పులతో కొట్టిన ఏబీవీపీ కార్యకర్తలు!
కర్ణాటక అబ్కారీ శాఖ మంత్రి హెచ్.వై.మేటి ఇంటి ముందు నిరసనలు తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తలు సంయమనం కోల్పోయి ఆయన ఇంట్లోకి చొరబడిన వేళ, మంత్రి ఇంట్లో లేకపోవడంతో అక్కడ కనిపించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫోటోను చెప్పులతో కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాగల్ కోట్ లో జరిగిన ఈ నిరసన ఉద్యమంలో మంత్రి ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమైంది. దాదాపు గంటపాటు నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వీరంగం సృష్టించారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిరసనలకు నాయకత్వం వహించిన కుమార్ హీరేమఠ్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు.