: మీ పేరు 'సింధు' అయితే ఈ రోజే పిజ్జా హట్ కు వెళ్లండి...ఉచితంగా పిజ్జా పొందండి!
రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు భారతదేశానికి రజతపతకాన్ని అందించిన నేపథ్యంలో పిజ్జా హట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సింధు అన్న పేరు ఉన్న వారందరికీ పిజ్జాను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు మాత్రమే వర్తిస్తుందని పిజ్జా హట్ యజమాని ఉన్నత్ వర్మ తెలిపారు. సాక్షీ మాలిక్ కాంస్య పతకం గెలిచిన రోజు సాక్షి అన్న పేరు కలిగిన వారందరికీ ఉచితంగా పిజ్జాలు అందజేసినట్టు ఆయన తెలిపారు. ఇలాంటి ఆఫర్ వల్ల భవిష్యత్ లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని, దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచడంలో యువత భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరెందుకాలస్యం, 'సింధు'లందరూ వెంటనే పిజ్జాహట్ కు వెళ్లి మీ పిజ్జాను పొందండి!