: గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో శవం...పక్కనే కోటి రూపాయలు


గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో శవంతో పాటు కోటి రూపాయలను రైల్వే పోలీసులు గుర్తించారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ ప్రయాణికుడి శవాన్ని హౌరా నుంచి ముంబై వెళ్తున్న గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో రైల్వే పోలీసులు ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో గుర్తించారు. అతని పక్కనే కోటి రూపాయల నగదుతో కూడిన ఒక సంచి కూడా లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ మృతదేహానికి కొటి రూపాయలకు గల సంబంధాన్ని వెలికి తీసే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News