: రికార్డులకెక్కిన మోదీ సూట్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్ గుర్తుందా? సూట్ మొత్తం ఆయన పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన, అత్యంత ఖరీదైన సూట్ అది. దీని ధరపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అనంతరం ఆ సూట్ ను వేలం వేయగా, దానిని గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్ లైన్స్ యజమాని లాల్జీ భాయ్ పటేల్ 4.31 కోట్ల రూపాయలకు 2015 ఫిబ్రవరి 20న దక్కించుకున్నారు. దీనిని 5 కోట్లు వెచ్చించైనా సొంతం చేసుకోవాలని భావించానని ఆయన అప్పట్లో తెలిపారు. ఇప్పుడీ సూట్ ను అత్యంత ఖరీదైన సూట్ గా గుర్తిస్తూ వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్ లో చోటు కల్పించారు.