: ఇప్పుడు సింధుకి ఫోన్ ఇస్తా...తియ్యని పెరుగు తిననిస్తా: గోపీచంద్


రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నానని ఆమె కోచ్ గోపీచంద్ తెలిపారు. రజతపతకం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మూడు నెలలుగా సింధుపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయని అన్నారు. మూడు నెలల క్రితం ఆమె నుంచి ఫోన్ తీసేసుకున్నానని ఆయన తెలిపారు. ఇప్పుడా ఫోన్ ఇచ్చి, ఫ్రెండ్స్ తో ఛాట్ చేసుకోమంటానని చెప్పారు. అలాగే సింధును ఏదీ సరిగ్గా తిననివ్వలేదని, ఆమెకు ఎంతో ఇష్టమైన తియ్యని గడ్డపెరుగును తిననిస్తానని ఆయన తెలిపారు. అలాగే ఐస్ క్రీం కూడా ఆమెను తిననివ్వలేదని, ఇకపై ఆమెకు నచ్చినది తినొచ్చని, సాధారణ యువతిలా ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదించవచ్చని, ఆంక్షలు సడలిస్తున్నానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News