: బులంద్ షహర్ 'తల్లీకూతుళ్ల' అత్యాచార కేసును సీబీఐకి అప్పగించిన న్యాయస్థానం
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ లో తల్లి, కూతుళ్లను గ్యాంగ్ రేప్ చేసిన కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని అడ్డుకొని, వారిలోని తల్లీకూతుళ్లపై ఆరుగురు కామాంధులు చేసిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కేసు తీవ్రత దృష్ట్యా అలహాబాద్ హైకోర్టు తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ అధికారులు ఈ దారుణంపై పూర్తి విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. సీబీఐ ప్రతినిధి దేవ్‌ప్రీత్ సింగ్ ఈ కేసు విషయమై మాట్లాడుతూ... ఘటనపై కిడ్నాప్, అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదయినట్లు పేర్కొన్నారు.