: పదిరోజుల పసికందును కొని నయీమ్‌కు అప్పజెప్పిన అత్త
పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తోన్న పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. పదిరోజుల పసికందును కొన్న నయీమ్ అత్త, ఆ శివును ఆయనకు అప్పజెప్పిందని తెలుసుకున్న పోలీసులు ఈరోజు ఈ వ్యవహారంలో భాగస్వాములైన ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. నయీమ్ అత్త రెండున్నర నెలల కిందట పసికందును కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శిశువును విక్రయించిన వ్యక్తిని నల్గొండ జిల్లా పెద్ద ఊరమండలం ఏనెమీది తండాకు చెందిన దత్తుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ పసికందు షాద్‌నగర్‌లో నయీమ్ బంధువుల ఇంట్లో ఉండగా అక్కడి నుంచి శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.