: మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం యరపతినేని!... ముస్లింల హజ్ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్థిక సాయం
టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తున్నారు. గత కొంతకాలంగా ఏటా ముస్లింల సంక్షేమం కోసం రూ.10 లక్షల మేర సొంత నిధులను ఖర్చు చేస్తున్న ఆయన... తాజాగా ముస్లింల హజ్ యాత్రకు నేరుగా ఆర్థిక సాయం చేశారు. పిడుగురాళ్లకు చెందిన ఆరు ముస్లిం కుటుంబాలు హజ్ యాత్రకు వెళ్లేందుకు ఒక్కో కుటుంబానికి లక్ష వంతున మొత్తం రూ.6 లక్షలను ఆయన అందజేశారు.