: పోలీస్‌ కానిస్టేబుల్‌పై దొంగ‌ల కాల్పులు.. మృతి


విధి నిర్వహణలో భాగంగా దొంగలను పట్టుకునేందుకు పరిగెత్తుతోన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగ‌లు జ‌రిపిన కాల్పుల‌కు మృతి చెందిన ఘ‌ట‌న నిన్న రాత్రి ఢిల్లీలోని షహబాద్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. సెక్టార్‌ 5 ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ మహిళ వద్ద నుంచి బ్యాగు దొంగిలించిన దుండ‌గులు అనంత‌రం అక్క‌డినుంచి ఉడాయించే ప్ర‌య‌త్నం చేశారు. విష‌యాన్ని తెలుసుకున్న ఆనంద్ అనే కానిస్టేబుల్ దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు వారి వెంట ప‌రుగెత్తాడు. ఈ క్ర‌మంలో దుండ‌గులు త‌మ వ‌ద్ద ఉన్న తుపాకీతో ఆనంద్‌పై కాల్పులు జ‌రిపారు. తీవ్ర‌గాయాల‌పాలైన ఆనంద్‌ను ఆసుప‌త్రికి తరలించినా, ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని డీసీపీ విక్రమ్‌జీత్‌ సింగ్ మీడియాకు తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News