: చాంబర్ల వైశాల్యంలో హెచ్చుతగ్గులు!...ఏపీ మంత్రుల కినుకతో కాంట్రాక్టు కంపెనీల దిద్దుబాటు!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో నిర్మాణం జరుగుతున్న తాత్కాలిక సచివాలయంలో మంత్రుల కోసం ఏర్పాటు చేస్తున్న చాంబర్లన్నీ ఒకే సైజులో లేవట. ఇప్పటికే చాంబర్లు చిన్నగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వాటిలో కాలు పెట్టేందుకు ఏపీ మంత్రులంతా వెనకడుగు వేస్తున్నారు. తాజాగా ఆయా చాంబర్ల వైశాల్యాల్లోని హెచ్చతగ్గులు కూడా వారి దృష్టికి వెళ్లాయి. దీంతో మరోమారు మంత్రులు అలకపాన్పు ఎక్కగా, వారిని శాంతపరిచేందుకు కాంట్రాక్టు కంపెనీలు రంగంలోకి దిగక తప్పలేదు. మిగిలిన చాంబర్ల కంటే వైశాల్యంలో కాస్తంత తక్కువగా ఉన్న ఐదో చాంబర్ ను విస్తరించే పనులకు ఆ కంపెనీలు శ్రీకారం చుట్టాయట.

  • Loading...

More Telugu News