: కోడెలతో నారా లోకేశ్ భేటీ!... తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ!


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేటి ఉదయం గుంటూరు వెళ్లారు. టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ గా కొనసాగుతున్న కోడెల శివప్రసాద్ తో ఆయన భేటీ అయ్యారు. ఓ వైపు విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలోనే కోడెలతో నారా లోకేశ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పుష్కరాల నిర్వహణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తదుపరి అసెంబ్లీ సమావేశాలను అమరావతిలోనే నిర్వహించాలని కోడెల భావిస్తున్న నేపథ్యంలో దీనిపైనా వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News