: నా కుమారుడు సినిమాల్లోకి వస్తున్నాడు!... పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసమే వచ్చానన్న కుమారస్వామి
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సమావేశంపై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సాగుతున్న చర్చలకు చెక్ పెట్టేస్తూ కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్ తో పాటు కుమారస్వామి కూడా వేర్వేరు ప్రకటనలు చేశారు. పవన్ కల్యాణ్ తో తన భేటీకి రాజీయాలతో ఎలాంటి సంబంధం లేదని కుమారస్వామి ప్రకటించారు. తన కుమారుడు త్వరలోనే చిత్రసీమలో అడుగుపెట్టనున్నాడని, ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసమే ఆయనతో భేటీ అయ్యానని ఆయన తెలిపారు.