: అంబులెన్స్‌ను చోరీ చేసి, అందులో వెళ్లిపోయిన‌ మహిళ


రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు ఆఖరి బస్సు కూడా మిస్ అయిపోతే ఏం చేస్తాం? ఏ ట్యాక్సీ కోస‌మో, వాహ‌న‌దారులు ఇచ్చే లిఫ్ట్ కోస‌మో ప్ర‌య‌త్నాలు చేస్తాం. అదీ కుద‌ర‌క‌పోతే చివ‌రికి న‌డుచుకుంటూ అయినా వెళ్లిపోతాం. అయితే అమెరికాలో మాత్రం ఓ మ‌హిళ అలా చేయ‌లేదు. రాత్రి పూట బ‌స్సు కోసం బ‌స్టాండ్‌కి వ‌చ్చిన లిసా కార్(43) చివ‌రి బ‌స్సు కూడా వెళ్లిపోయింద‌ని తెలుసుకొని, ఖాళీగా క‌నిపించిన‌ అంబులెన్సులో డ్రైవ‌ర్ సీటులో కూర్చొని ఎంచక్కా అందులో వెళ్లిపోయింది. లిసా కార్ ఒహియ రాష్ట్రంలోని స్ప్రింగ్​ఫీల్డ్ టౌన్షిప్ కి చెందిన మహిళ. అంబులెన్స్ ను ఆస్పత్రి ముందు నిలిపి డ్రైవ‌ర్‌ రోగితో పాటు వెళ్లిన‌ప్పుడు అంబులెన్స్ ఖాళీ ఉంది. దీంతో లిసా అందులో వెళ్లిపోయింది. డ్రైవ‌ర్ మ‌ళ్లీ తిరిగి వ‌చ్చి చూస్తే ఆ అంబులెన్స్ క‌నిపించ‌లేదు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమెపై దొంగతనం ఆరోపణ కేసు న‌మోదు చేశారు. దీంతో లిసా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యే అవ‌కాశం ఉంది. రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు ఆఖరి బస్సు కూడా వెళ్లిపోవడంతో ఈ ప‌నిచేసిన‌ట్లు నిందితురాలు ఒప్పుకుంది.

  • Loading...

More Telugu News