: తొమ్మిదో రోజుకు చేరిన కృష్ణా పుష్కరాలు!... కిటకిటలాడుతున్న ఘాట్లు!


తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కోలాహలంగా సాగుతున్న కృష్ణా పుష్కరాలు నేటితో తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మరో మూడు రోజులు మాత్రమే పుష్కరాలు కొనసాగనున్నాయి. తొలుత కాస్తంత పలుచగా కనిపించిన భక్తజనం రోజురోజుకూ భారీగా పెరిగింది. ఇక మూడు రోజులే మిగిలి ఉండటంతో నేటి తెల్లవారుజామున పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. ఏపీ, తెలంగాణల్లోని అన్ని పుష్కర ఘాట్లలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

  • Loading...

More Telugu News