: సాగర్ శివాలయం ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ తల్లి!... పుష్కర స్నానం చేసిన శాలిని!
టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని పుష్కర స్నానం చేశారు. నిన్న మధ్యాహ్నం సమయంలో గుంటూరు జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ శివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ కు వచ్చారు. చడీ చప్పుడు లేకుండానే ఆమె పుష్కర స్నానం ఆచరించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి వచ్చిందని తెలుసుకున్న అక్కడి వారు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. విషయం తెలుసుకున్న మీడియా ఆమె వద్దకు వెళ్లి పలకరించింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు శాలిని తిరస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.