: గొందిమళ్ల పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రావణ శనివారం కావడంతో పుష్కరఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు మహబూబ్‌నగర్ గొందిమళ్ల పుష్కర ఘాట్‌లో ఈరోజు పుణ్యస్నానమాచరించారు. గవర్నర్ వెంట తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. మరికాసేపట్లో గవర్నర్ జోగులాంబ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శత చండీయాగంలో ఆయన పాల్గొననున్నారు. మరోవైపు సోమశిల, బీచుపల్లి, వాడపల్లి పుష్కరఘాట్లకు తెల్లవారుజామునుంచే భక్తులు తరలివచ్చారు.