: ఒలింపిక్స్ చరిత్రలో బోల్ట్ సరికొత్త రికార్డు!... పరుగులో ‘హ్యాట్రిక్’ ట్రిపుల్ సాధించిన జమైకా చిరుత!


ఒలింపిక్స్ చరిత్రలో జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ లో 100, 200, 400 మీటర్ల పరుగులో అతడు పసిడి పతకాలు సాధించేశాడు. కొద్దిసేపటి క్రితం రియోలో జరిగిన 400 మీటర్ల పరుగులో అతడు స్వర్ణం సాధించాడు. వెరసి ఈ మూడు ఈవెంట్లలో మూడు ఒలింపిక్స్ ల్లో మూడు స్వర్ణాలు సాధించిన ఆథ్లెట్ గా అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే రియోలో అతడు 100, 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 400 మీటర్ల పరుగులోనూ మెరుపు వేగంతో దూసుకెళ్లిన అతడు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వెరసి పరుగులో తనకు సాటి రాగల వారు సమీప భవిష్యత్తులో లేరని అతడు తేల్చి చెప్పాడు.

  • Loading...

More Telugu News