: గెలుపు, ఓటమి సహజం!.. మారిన్ మెరుగ్గా ఆడింది!: ఓటమిపై సింధు విశ్లేషణ
రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ నిన్న రాత్రి ఉత్కంఠభరితంగా సాగింది. తెలుగు తేజం పీవీ సింధు, వరల్డ్ నెంబర్:1 కరోలినా మారిన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ సుదీర్ఘంగా మూడు సెట్ల పాటు సాగింది. తొలి సెట్ ను కైవసం చేసుకున్న సింధు... తర్వాత రెండు సెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రజత పతకం స్వీకరించిన సింధు... తాను ఓటమిపాలైన తీరుపై మీడియాతో మాట్లాడింది. అసలు తాను రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధిస్తానని అనుకోలేదని చెప్పింది. ఆటలో గెలుపోటములు సహజమని పేర్కొన్న సింధు... ఫైనల్ పోటీ అద్భుతంగా సాగిందని పేర్కొంది. గోల్డ్ మెడల్ సాధిస్తానని అనుకున్నానని చెప్పింది. అందుకోసమే ఫైనల్ మ్యాచ్ కు బాగా ప్రిపేర్ అయ్యానని తెలిపింది. అయితే ప్రత్యర్థి మారిన్ ఆట తీరు మెరుగ్గా ఉందని చెప్పింది.