: తెలంగాణలో కొత్త జిల్లాలపై అఖిలపక్షం నేడే!... అన్ని పార్టీల నుంచి నేతల ఖరారు!
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తి అయ్యింది. ఇప్పటికే దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను సీఎం కేసీఆర్ కు అందించిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం అత్యంత కీలకమైన నేపథ్యంలో దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేడు సచివాలయంలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ప్రతినిధులను పంపాలని ఆయా పార్టీలకు ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీల తరఫున అఖిలపక్ష భేటీకి హాజరుకానున్న నేతలను ఖరారు చేశాయి. అధికార టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు, నిరంజన్ రెడ్డి; కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ; టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి; బీజేపీ నుంచి రామచంద్రరావు, డాక్టర్ ఎస్.మల్లారెడ్డి; ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, తమ్మినేని వీరభద్రం; సీపీఐ నుంచి చాడా వెంకటరెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు.