: పీవీ సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు
‘రియో’లో బ్యాడ్మింటన్ లో భారత్ కు తొలి సిల్వర్ మెడల్ అందించిన షట్లర్ పీవీ సింధుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ కు కూడా ఆయన అభినందనలు తెలిపారు. యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాగా, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తుది పోరులో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తో తలపడ్డ పీవీ సింధు ఓటమి పాలైంది. వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న మారిన్ ఒలింపిక్స్ లో స్వర్ణ విజేతగా నిలిచింది.