: రెండో, మూడో సెట్ లో కోలుకోలేకపోయింది.. అయినా దేశానికి రజతపతకం తెచ్చింది: సింధు తండ్రి రమణ


తొలి సెట్ లో అద్భుతంగా ఆడిన సింధు రెండో సెట్, మూడో సెట్లలో అవకాశాలు కల్పించుకోవడంలో వెనుకబడిందని ఆమె తండ్రి రమణ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా ఆడడం ఎలా అన్నది సింధు నేర్చుకుంటుందని అన్నారు. మారిన్ అద్భుతంగా ఆడిందని, సింధుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడిందని ఆయన ప్రశంసించారు. అయితే సింధు దేశ ప్రజలను నిరాశపర్చలేదని, దేశానికి బహుమతిగా రజతపతకం తీసుకుని వస్తుందని అన్నారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇంత వరకు ఏ క్రీడాకారిణి సాధించని ఘనతను తను సాధించిందని ఆయన తెలిపారు. సింధును చూసి తల్లిదండ్రులుగా తాము, బిడ్డగా భరత మాత గర్విస్తోందని అన్నారు. సింధు విజయంలో భాగమైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News