: మిస్ ఆసియా 2016గా ఫిలిప్పీన్స్ సుందరి ట్రిప్సియా మారి


మిస్ ఆసియా -2016గా ఫిలిప్పీన్స్ కు చెందిన ట్రిప్సియా మారి విజేతగా నిలిచింది. కేరళలోని కొచ్చి ప్రాంతంలో ‘మిస్ ఆసియా’ అంతర్జాతీయ అందాల పోటీలను నిన్న రాత్రి నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 18 మంది అందాల భామలు పాల్గొన్నారు. బెలారస్ కు చెందిన యుజెనీయా వాసియావ తొలి రన్నరప్ గా నిలవగా, భారత్ కు చెందిన అంజితా కరాత్ రెండో రన్నరప్ గా నిలిచింది. కాగా, ట్రిప్సియా మారి ‘మిస్ ఆసియా’ కిరీటాన్ని కైవసం చేసుకోవడంపై ఆమెను పలువురు అభినందించారు.

  • Loading...

More Telugu News