: పోలీసులను ఆశ్రయించిన బెంగాలీ పాప్యులర్ టీవీ నటి
బెంగాలీ పాప్యులర్ టీవీ నటి మధుమిత చక్రవర్తి పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయని ఆమె తెలుసుకుంది. దీంతో కోల్ కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్నెట్ లో మధుమితకు సంబంధించిన 100 మార్ఫెడ్ ఫొటోలను గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులు రెండు వేర్వేరు ఫోటోలను తీసుకుని ఈ మార్ఫింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. వీరు ఎక్కడి నుంచి అప్ లోడ్ చేశార్న విషయాన్ని గుర్తిస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.