: కశ్మీర్‌లో ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర సరుకుల ధరలు
హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ సైనికుల చేతిలో ఎన్‌కౌంటర్ అయిన తరువాత కశ్మీర్‌లో పరిస్థితులు కల్లోలంగా మారిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ఎన్నో ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 42 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. రవాణా వ్యవస్థ కూడా పనిచేయడం లేదు. దీంతో అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య ప్రజలు కనీస అవసరాలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా భద్రతా బలగాలు భారీ ఎత్తున మోహరించాయి.