: రాష్ట్రపతి గారూ! లంచం ఇచ్చుకోలేను, ఆత్మహత్య చేసుకుంటా, అనుమతించండి!: నోయిడా పౌరుడి వినతి
ఒక సంస్థ ఏర్పాటు నిమిత్తం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓసీ) ఇవ్వమని కోరితే సంబంధిత అధికారులు లంచం కోసం ఏళ్ల తరబడి తిప్పుతున్నారని, ఈ ఒత్తిడిని తాను తట్టుకోలేనని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాని కోరుతూ, డీకే గార్గ్ అనే యాభై నాలుగేళ్ల ఒక వ్యక్తి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ (జీఎన్ఐడీఏ) ఉద్యోగులు ఈ విషయమై తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ ఒత్తిడి కారణంగా తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని, అందుకు అనుమతించాలని ఆ లేఖలో ఆయన కోరారు. కాగా, జీఎన్ఐడీఏ సీఈఓ దీపక్ అగర్వాల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఎన్ఓసీ మంజూరు నిమిత్తం సరైన పత్రాలను గార్గ్ సమర్పించలేదని, అందుకే ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై త్వరలోనే ఒక నివేదిక అందిస్తామని దీపక్ అగర్వాల్ పేర్కొన్నారు.