: ఈనెల 20 నుంచి 26 వరకు తెలంగాణ వ్యాప్తంగా పొడివాతావరణం
భారీ వర్షాలు కురిసిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పొడివాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. వచ్చేవారానికి వాతావరణ అంచనాలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ఈరోజు విడుదల చేసింది. ఈనెల 20 నుంచి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పొడివాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. అయితే, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.