: హైటెక్ సిటీకి రాజీవ్ గాంధీ పేరుపెట్టాలి: వీహెచ్


హైటెక్ సిటీకి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. దేశంలో టెక్నాలజీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన రాజీవ్ గాంధీ పేరును హైటెక్ సిటీకి పెట్టాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాజీవ్ గాంధీ ఆలోచననే నాడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఆచరించారని, హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బాబు కృషి చేశారని అన్నారు. పలువురు ప్రముఖులు చేసిన సేవలకు గుర్తింపునిస్తూ వారి పేర్లను తెలంగాణలోని పలు సంస్థలకు పెడుతుండటం శుభపరిణామమని, అందులో భాగంగానే హైటెక్ సిటీకి రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని వీహెచ్ కోరారు.

  • Loading...

More Telugu News