: భువనగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో 30 మంది నయీమ్ బాధితుల ఫిర్యాదు
తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు విడిచిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఇప్పటికే పదుల సంఖ్యలో నయీమ్ బాధితులు ఫిర్యాదులు చేశారు. నయీమ్, అతని అనుచరుల ఆగడాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈరోజు నల్గొండ జిల్లాలో వ్యాపారి ప్రదీప్‌రెడ్డి నుంచి ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది సేపటికే అదే జిల్లాలోని భువనగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో 30 మంది నయీమ్ బాధితులు ఫిర్యాదు చేశారు. 2007లో చొక్కపురంలో తమను బెదిరించి నయీమ్ అనుచరులు తక్కువ ధరకు 16 ఎకరాల భూమిని లాక్కున్నారని వారు ఫిర్యాదు చేశారు.