: పుష్కరాల వ్యయాన్ని వృథాఖర్చు అనడం దారుణం: ఏపీ మంత్రి చినరాజప్ప


వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుష్క‌రాల నేప‌థ్యంలో చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప మండిప‌డ్డారు. ఈరోజు ఆయ‌న‌ విజయవాడలోని పలు పుష్కరఘాట్లను ప‌రిశీలిస్తూ పలువురు భక్తులతో మాట్లాడారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో భక్తిభావంతో చేప‌ట్టిన పుష్క‌ర‌ కార్య‌క్ర‌మాన్ని డబ్బుల వృథాగా జ‌గ‌న్ పేర్కొన్నార‌ని, ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణమని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎంతో క‌ష్ట‌ప‌డి చేప‌డుతోన్న న‌వ్య రాజ‌ధాని అమరావతి నిర్మాణానికి జ‌గ‌న్ అడ్డుతగులుతున్నార‌ని, ఆయ‌న‌ లక్ష్యం కూడా అదేనని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News