: కోట్ల మంది చూస్తున్నారు...టోక్యో ఒలింపిక్స్ కి ఇప్పట్నుంచే సిద్ధమవుదాం: మోదీకి కేటీఆర్ సూచన
దేశం మొత్తం సింధు నామస్మరణలో మునిగిపోయింది. క్షణక్షణానికి సింధుకు అభిమానులు పెరుగుతున్నారు. ప్రతి భారతీయుడు సింధు స్వర్ణం గెలిచి దేశ కీర్తిపతాక సగర్వంగా ఎగరేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ సూచన చేశారు. 'వంద కోట్ల మందికి పైగా వున్న భారతీయులు పతకాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రీడల్లో యువత తమని తాము నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారు. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సిధ్ధమవుదాం' అని కేటీఆర్ సూచించారు. మిషన్ టోక్యో పేరిట ఆటగాళ్లను తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.