: తిరుపతిలో పీవీ సింధు బ్యానర్లు చేతపట్టి వంద కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చిన అభిమానులు
పసిడి పతకం దిశగా పరుగులు తీస్తోన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజయం సాధించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు జరుపుతున్నారు. సింధుపై భారతావని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ, వారణాసిలో సింధు గెలవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీవర్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సింధు విజయాన్ని కాంక్షిస్తూ తిరుపతిలో ఆమె అభిమానులు ర్యాలీలు తీశారు. బ్యానర్లు చేతపట్టి సుమారు వంద కొబ్బరికాయలు కొట్టి సింధు ఫోటోకి హారతిచ్చారు. అనంతరం ఆ ఫోటోకి దిష్టితీశారు. సింధు తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌కి సింధు పసిడి పతకంతోనే తిరిగి వస్తుందని అన్నారు. హైదరాబాద్‌లోనూ అనేక ఆలయాల్లో క్రీడాభిమానులు పూజలు నిర్వహించి, సింధు విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.