: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో టీమిండియా జోరును అడ్డుకున్న వరుణుడు...విండీస్ 62/2


వెస్టిండీస్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఆతిధ్యజట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా జోరును వరుణుడు అడ్డుకున్నాడు. నాలుగో టెస్టులో గెలిచి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును స్థిరపరచుకుందామని భావించిన కోహ్లీ సేనను నిరాశకు గురిచేస్తూ వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం 22 ఓవర్ల పాటు సాగిన తొలిరోజు ఆటలో ఓపెనర్ జాన్సన్ (9), బ్రావో (10) వికెట్లను టీమిండియా దొరకబుచ్చుకోగా, బ్రాత్ వైట్ (32), శామ్యూల్స్ (4) క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. పిచ్ పై టర్న్ మొదలవుతుందనగా వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. నేడు రెండో రోజు మ్యాచ్ కొనసాగనుంది.

  • Loading...

More Telugu News