: 36కు పెరిగిన కుంభమేళా మృతుల సంఖ్య


అలహాబాదు రైల్వే స్టేషను వద్ద ఆదివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 36కు పెరిగింది. మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా నిన్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో అలహాబాదు రైల్వే స్టేషన్ వద్ద కాలివంతెన కూలిపోవడంతో ఏర్పడిన గందరగోళ పరిస్థితులలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇదిలా వుండగా, ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల వంతున, క్షతగాత్రులకు లక్ష చొప్పున ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది.    

  • Loading...

More Telugu News