: పుల్లెల గోపీచంద్‌కు ఆనాడు అందించిన స‌హ‌కార‌మే ఈరోజు దేశానికి ఒలింపిక్స్ పతకం తెచ్చిపెట్టింది: చ‌ంద్రబాబు


జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, పీవీ సింధు శిక్షకుడు పుల్లెల గోపీచంద్‌కు ఆనాడు తాము అందించిన స‌హ‌కార‌మే ఈరోజు దేశానికి ఒలింపిక్స్ పతకం తెచ్చిపెట్టిందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఏపీ మెడిటెక్‌ జోన్ పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సులో ఈరోజు చంద్ర‌బాబు మాట్లాడుతూ.. క్రీడ‌ల‌ను ప్రోత్స‌హిస్తే అత్యుత్త‌మ క్రీడాకారులను త‌యారు చేసిన వాళ్ల‌మవుతామ‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో ఆనాడు క్రీడ‌ల అభివృద్ధికి ఎంతో కృషి చేశామ‌ని వ్యాఖ్యానించారు. పీవీ సింధు బ్యాడ్మింట‌న్‌లో ఫైనల్‌కు చేర‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఏడాది లోగా ఏపీ మెడిక‌ల్ జోన్‌లో ఉత్ప‌త్తి ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మెడిటెక్‌ జోన్ ద్వారా 25 వేల‌మంది యువ‌త‌కు ఉపాధి క‌లుగుతుంద‌ని చంద్రబాబు అన్నారు. దీనిలో పెట్టుబ‌డులు పెట్టేవారికి అన్ని విధాల స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News