: సింధూ.. నీకు ఫైనల్‌ రూపంలో అతిపెద్ద పోరు ఎదురుకాబోతోంది!: విరాట్‌ కోహ్లి


రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి ఫైనల్‌కి చేరిన భారత షట్లర్‌ పీవీ సింధు విజయాన్ని కోరుకుంటూ భార‌తీయులంతా ఇప్పుడు ఆమె నామ‌స్మ‌ర‌ణే చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా సింధు అద్భుతంగా రాణిస్తుండ‌డాన్ని ప్ర‌శంచిన విష‌యం తెలిసిందే. సింధూపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌లో ఉన్న కోహ్లీ.. ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'పీవీ సింధుకి హాయ్' అంటూ తన సందేశాన్ని ప్రారంభించిన కోహ్లీ.. రియో ఒలింపిక్స్ లో ఇండియాకు ఓ పతకం ఖాయం చేసినందుకు తాను అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నాడు. సింధుని చూసి యావ‌త్ భార‌త్‌ గర్విస్తోందని అన్నాడు. ఈరోజు సింధుకి ఫైనల్‌ రూపంలో అతిపెద్ద పోరు ఎదురుకాబోతుంద‌ని ఆయ‌న చెప్పాడు. ఫైన‌ల్‌లో సింధు గెలిచి గెలిచి దేశానికి స్వ‌ర్ణం అందిస్తుంద‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఈరోజు జ‌రిగే చివ‌రి ఫైట్‌లో ఆ ఫలితం ఎలా ఉన్నా సింధునే మ‌న‌ ఛాంపియన్ అని అన్నాడు.

  • Loading...

More Telugu News