: సింధు లక్షలాది మంది అమ్మాయిలకు స్ఫూర్తి!... తెలుగు తేజంపై కవిత కామెంట్!
రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ చేరిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీఆర్ఎస్ మహిళా నేత, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం సింధు ప్రతిభను మెచ్చుకుంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. సింధు లక్షలాది మంది అమ్మాయిలకు స్ఫూర్తి అని కవిత వ్యాఖ్యానించారు. సింధు గెలుపు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు. టైటిల్ పోరులోనూ సింధు విజయం సాధిస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని ఆమె చెప్పారు.