: మరో ఫిర్యాదు.. నయీమ్ అనుచరులు తనపై నాలుగుసార్లు హత్యాయత్నం చేశారన్న నల్గొండ వాసి
ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్లో ప్రాణాలు విడిచిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో ఓ పక్క ముమ్మరంగా విచారణ జరుగుతుండగానే మరోపక్క నయీమ్, అతని అనుచరుల ఆగడాలపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈరోజు నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంకు చెందిన ప్రదీప్‌రెడ్డి అనే వ్యాపారి నుంచి అధికారులకు మరో ఫిర్యాదు అందింది. నయీమ్ అనుచరులు తనపై నాలుగుసార్లు హత్యాయత్నం చేశారని ప్రదీప్‌రెడ్డి చెప్పారు. వలిగొండలో నయీమ్ తన రెస్టారెంట్‌ను మూయించాడని తెలిపారు. తన సన్నిహితులు సాంబశివుడు, రాములు వెంట తిరగొద్దని నయీమ్ అనుచరులు తనను పలుసార్లు బెదిరించారని చెప్పారు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వేడుకున్నారు.