: సింధు విజయం సంతోషమిచ్చిందన్న సచిన్!... సింధు టైటిల్ వేట కోసం ఆసక్తిగా ఉన్నానని కామెంట్!
రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ వేటకు సిద్ధమైన తెలుగు తేజం పీవీ సింధుపై... క్రికెట్ దేవుడు, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టైటిల్ వేటలో సింధు విజయం సాధించాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. క్వార్టర్ ఫైనల్, సెమీస్ లలో సింధు విజయం తనకు సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. సింధు ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా సచిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రియోలోనే ఉన్న సచిన్ ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.