: వైఎస్ జగన్ శరీరమంతా విషమే!... విపక్ష నేతపై మంత్రి దేవినేని ఫైర్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పుష్కరాలకు హాజరైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైరయ్యారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ శరీరమంతా విషమే ఉందన్న దేవినేని... పుష్కరాలను కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోతే... దానిని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలు అద్భుతంగా జరుగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారంటూ జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.