: ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందే... వెనక్కు తగ్గితే మరో ఉద్యమమే! విద్యార్థి జేఏసీ హెచ్చరిక
ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనన్న డిమాండ్ తో ఆ రాష్ట్రంలో మరో ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యార్థి జేఏసీ, టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సదస్సుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కృష్ణ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషాద్రి నాయుడు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం ఏమాత్రం వెనకడుగు వేసినా రాష్ట్రం మరో భారీ ఉద్యమానికి సిద్ధం కాక తప్పదని వారు హెచ్చరించారు.