: సింధు రాకెట్ ముందు ఎవరైనా బలాదూరే!... వరుస సెట్లలో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్న తెలుగు తేజం!


నిజమే... తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చేతబట్టిన రాకెట్ ముందు ఎవరైనా బలాదూరే. బ్యాడ్మింటన్ కోర్టులో గడచిన కొంత కాలంగా సింధు ఆటతీరును పరిశీలించిన వారెవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. రియో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్... ఈ రెండు మ్యాచ్ లను పరిశీలిస్తే కూడా ఈ విషయం తేటతెల్లమవుతుంది. క్వార్టర్ ఫైనల్ లో వరల్డ్ నెంబర్:2 ర్యాంకర్ వాంగ్ ఇహాన్ ను వరుస సెట్లలో సింధు చిత్తు చేసింది. తాజాగా నిన్న రాత్రి జరిగిన సెమీ ఫైనల్ లోనూ జపాన్ క్రీడాకారిణి ఒకుహరా పై సింధు వరుస సెట్లలోనే మ్యాచ్ ను ముగించింది. అంటే... సింధు కీలక విజయాలు నమోదు చేసిన ఈ రెండు మ్యాచ్ లలో ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు సింధుకు రెండు సెట్లు మాత్రమే సరిపోయాయి. అసలు ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వని రీతిలో సత్తా చాటుతున్న సింధుకు మూడో సెట్ ఆడే అవసరం లేకుండాపోతోంది. మరి రేపటి మ్యాచ్ లోనూ ఇదే రీతిన సింధు రాణిస్తే... వరల్డ్ నెంబర్:1 ర్యాంకులో ఉన్న కరోలినా మారిన్ కూడా చిత్తు కావాల్సిందే.

  • Loading...

More Telugu News