: ‘గో గోల్డ్’ మారుమోగుతోంది!... సింధు విజయం కోసం ఎలుగెత్తి నినదిస్తున్న భారతావని!


నిన్న రాత్రి నుంచి దేశం మొత్తం ‘గో గోల్డ్’ అని నినదిస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు రియో ఒలింపిక్స్ ఫైనల్ చేరిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఇదే నినాదం వినిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్స్ లో సింధు విజయం సాధించిన వెంటనే రెండు రోజుల క్రితమే విశాఖ వాసులు ‘గో గోల్డ్’ పేరిట నినాదాలు రాసి ఉన్న బ్యానర్లు పట్టుకుని సాగర తీరంలో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సింధు సెమీస్ లో కూడా సత్తా చాటి ఫైనల్స్ చేరిన నేపథ్యంలో విశాఖ వాసుల నోట వినిపించిన ‘గో గోల్డ్’ నినాదం దేశమంతా విస్తరించింది. రియోలో సింధు గోల్డ్ మెడల్ సాధించాలంటూ ఎక్కడికక్కడ జనం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News