: వొడాఫోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ తమ పోస్టుపెయిడ్ కస్టమర్లకు అన్లిమిటెడ్ ఆఫర్‌ను అందిస్తోంది. తమ కస్టమర్లు రోమింగ్ కాల్స్, డేటా ఎక్కువగా వాడుతున్నారని గుర్తించిన కంపెనీ నెలకు రూ.1,999కే అన్లిమిటెడ్ రోమింగ్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 8జీబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు రూ.1,699 రీఛార్జ్‌తో ఉచిత రోమింగ్(ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే), అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 6జీబీ డేటాను తమ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు పొందవచ్చని ప్రకటించింది. కొత్త వొడాఫోన్ ఆర్ఈడీతో, ఆల్-ఇన్-వన్ ప్లాన్‌ను తమ కస్టమర్లకు ఇప్పటికే ఆఫర్ చేశామని, దీని ద్వారా వారి రోమింగ్, డేటా, వాయిస్ కాలింగ్ వినియోగాన్ని పరిశీలించామని తెలిపింది. ఈ ఆఫర్లేగాక తమ కస్టమర్లకు 499 రూపాయలు, 699 రూపాయలు, 999 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.