: ‘హోదా’ లేదంటే ‘ప్యాకేజీ’!... ఏదో ఒక్కటేనంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చిన బీజేపీ!


రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇవ్వాలన్న వాదన ఆ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఈ దిశగా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. తమ డిమాండ్ మేరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోని పక్షంలో ఆ పార్టీతో మైత్రి బంధాన్ని తెంచుకునేందుకు కూడా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ దాదాపుగా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నేటి ఉదయం బీజేపీ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. బీజేపీ ఏపీ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత రఘునాథ్ బాబు ఓ తెలుగు టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న సందర్భంగా సదరు వాదనను వినిపించారు. ఈ వాదన ప్రకారం... ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే ఇస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెర తీయనున్నాయి.

  • Loading...

More Telugu News