: విశాఖలో రహదారి భద్రతపై కీలక సదస్సు!... హాజరుకానున్న చంద్రబాబు, గడ్కరీ!
రహదారి భద్రతపై ఏపీలోని విశాఖలో నేడు జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. నేడు, రేపు జరగనున్న ఈ సదస్సును ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో కీలక చర్చ జరగనుంది. రహదారి భద్రతతో పాటు ప్రమాదాల్లో గాయపడుతున్న వారికి తక్షణ వైద్యం అందేలా ట్రామా కేర్ సెంటర్ల సంఖ్య పెంపు తదితరాలపై నితిన్ గడ్కరీ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి.